Presentation of Jesus at the Temple | Fr.Thumma Velangini, Mana Puneethulu(02-FEB) | Divyavani TV
FULL TRANSCRIPT
[సంగీతం]
[సంగీతం]
[సంగీతం]
దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కతోలిక
విశ్వాసులకు క్రీస్తు నాధుని నామమున
శుభములు
క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు అది ఒక
జీవన
విధానం ఈ అనంత
జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణులు లాంటి
జీవి
కాదు నేను ఎక్కడి నుంచి వచ్చాను నా జీవిత
ప్రయాణం ఎలా సాగుతుంది నా జీవితానికి
పరమార్థం ఉందా నా జీవిత గమ్య స్థానం ఏమిటి
అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా
ఉద్భవిస్తాయి
ఈ ప్రశ్నలకు
సమాధానమే పునీతుల జీవిత
చరిత్ర ఎవరు ఈ పునీతులు మనకంటే ముందు
విశ్వాస పదములో
నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి
విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని
మనకంటే ముందు నేర్పించినటువంటి వారే
పునీతులు ఈ పునీతులు మోక్షము చేరారని
కతోలిక శ్రీ సభ
అధికారికముగా
ప్రకటిస్తుంది మనం కూడా ఈ పునీతుల జీవిత
ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య
సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం
వారి మాటలు మనకు ప్రేరణ కావాలి వారి
విశ్వాస పదం మనకు సుమాత్రుక కావాలి వారి
యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం
కావాలి కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి
మీ అందరినీ ప్రేమతో
[సంగీతం]
[సంగీతం]
ఆహ్వానిస్తున్నాం క్రీస్తు నాధుని యందు
ప్రియమైన సహోదరి సహోదరులారా కతోలిక
విశ్వాసులారా మీ అందరికీ ప్రభువు క్రీస్తు
నామమున
శుభోదయం ఈరోజు ఫిబ్రవరి రెండవ
తేదీ కతోలిక తిరుసభ సాంప్రదాయ ఆచారం
ప్రకారం బాల యేసును దేవాలయములో కానుకగా
అర్పించబడినటువంటి పండుగను ఈరోజు మనం
కొనియాడుతూ ఉన్నాము కొన్ని ప్రాంతాలలో ఈ
పండుగ కానుక మాత పండుగ పేరిట
పిలవబడుతుంది క్రిస్మస్ తరువాత అనగా
క్రీస్తు జన్మించిన తర్వాత 40
రోజులకు అనగా ఈ రోజున లూకా సువార్త రెండవ
అధ్యాయం 22వ వచనం నుండి మనం
చూసినట్లయితే బాల యేసును దేవా ఆలయములోకి
తీసుకొని వెళ్లి పావురాల రూపములో ఆయనను
కానుకగా
సమర్పించబడటాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము
ఈ పండుగ యొక్క విశేషాలను బైబిల్ గ్రంధ
ఆధారముగా దీని యొక్క విశిష్టతను మన
పునీతుల కార్యక్రమంలో ఇప్పుడు
తెలుసుకుందాం పవిత్ర కుటుంబం నుండి
వెలిగింపబడిన పుణ్యాలు ఈ పండుగ ద్వారా
మనకు జ్ఞాపకం
చేయబడుతున్నాయి పరలోక తండ్రి చిత్తానికి
ప్రేమపూర్వక స్పందన ఇది దైవంలో దైవంతో
దైవం వలన వారల మానవ ఫలం
పుష్పించినందుకు మహా వినమ్రతతో దైవ
చట్టములో పొందుపరచిన దానికి ప్రతిస్పందనే
ఈ పండుగ
యూదులకు యూదేతరులైన మానవాళి అందరికీ
జ్యోతి ప్రకటనే ఆ పవిత్ర కుటుంబం తండ్రి
దేవలంలోకి ప్రవేశానికి అర్థం తండ్రి
కుమారుడు పవిత్రాత్మ ఈ దేవలంలో ఈ సమయంలో
ఒకరికొకరు
అర్పించుకుంటున్నారు అర్పణ
స్వీకరిస్తున్నారు ప్రతిఫలం ప్రేమ
ప్రదర్శిస్తున్నారు ఆర్చ్ బిషప్ గారైన
ఫుల్టన్ జేషిన్ గారు ఇలా రాస్తున్నారు ఇది
మొట్టమొదటిసారిగా అర్పింపబడిన మొదటి దివ్య
పూజ దేవుని తల్లి నిష్కలంక కన్య మరియమ్మ
తన విశుద్ధ హస్తాల మీదుగా తన యందలి
పవిత్రాత్మ ప్రభావ శక్తి
మహిమలతో మనుష్యావతారి అయిన పుత్ర దేవుని
నిత్య జీవ రాజ్య పరలోక తండ్రికి ఈ లోక
ఆచారం పోకుండా పునః సమర్పణ గావించింది
ప్రతి పుష్పానికి క్రింద రెండు ఆకులు
ఉన్నట్లు అందాన్ని ఇనుమడింప చేసినట్లు
పునీత జోజప్ప గారు రెండు యువపావురపు
గువ్వలు ఉన్న పంజరాన్ని చేత పట్టుకొని
ఉన్నారు తనను తాను దైవానికి దైవ
చిత్తానికి దైవ సేవకు అర్పించుకున్న ఈ మహా
కారణ జన్ముడు మరియా బాల యేసును ఇద్దరిని
కూడా ప్రభువుకు నిరంతరంగా
అర్పిస్తున్నట్లు కనబడతారు తమది ఈ లోక
సంబంధంగా బీద కుటుంబం దీన మనుషులు అదే
జోజప్ప గారి చేతుల్లో పంజరం కర్ర దుస్తులు
పెరిగిన గడ్డం వంటి ఆకృతి
ప్రదర్శితమవుతుంది తమను పేదరికం దీనత్వం
పరిశుద్ధతను దేవునికి పునరంకితం చేస్తున్న
దృశ్యం ఇది ఈ అంకిత కుటుంబం శ్రీ సభకు
తొలి కుటుంబం శ్రీ సభకు తొలి సభ్యురాలిగా
ముందు పయనించిన కనికర కన్య మరియాంబ తల్లి
పాత్ర బహు ప్రశంసనీయమైంది
దేవ రహస్యం వలె తేట తెల్లం చేయగల బాల యేసు
ఆ తల్లి పొత్తిళ్లలో ఉన్నాడు పుట్టిన 40 వ
రోజున బాబును దేవాలయంలో కానుకగా అర్పింప
వెళ్ళుటను అక్కడ జరిగిన సంఘటనలను
లూకా రెండవ అధ్యాయం 22వ వచనము నుండి మనం
తెలుసుకుంటాం బాల యేసుని గుడిలో కానుకగా
అర్పించు పండుగను
నాలుగవ శతాబ్దం ప్రథమార్థంలో ప్రారంభమైంది
క్రీస్తు శకం 526 లో ప్రాచ్య
సామ్రాజ్యాలలో ఈ పండుగ ప్రసిద్ధమైంది
కాన్స్టెంట్ నోపుల్ రాజ్యములో కలరా అంటు
వ్యాధి ప్రభువు దయ వల్ల సమూలంగా
ఆగిపోవడంతో
కృతజ్ఞతగా ఒకటవ జుస్తీనియన్ జగద్గురువులు
ఈ పండుగ జరుపుకొన ఆదేశించారు 11వ
శతాబ్దంలో కృత్తులను ఆశీర్వదించటం ఎక్కువ
ఉపయోగములోకి రావటం జరిగింది అప్పటి నుండి
ఈ పండుగను క్యాండిల్ మాస్ పేరుతో
జరుపుకోవడం మొదలు పెట్టారు క్రోవత్తులు
వెలిగించుకొని దేవాలయంలోకి ప్రదక్షిణగా
వచ్చి బాల యేసుని గుడిలో కానుకగా
అర్పించినందుకు గురుతుగా ఈ క్రోవత్తులను
అర్పించేవారు సిమియోను దీర్ఘదర్శి బాల
యేసును అన్యులకు మార్గదర్శకమగు వెలుగు అని
చెప్పినందుకు గుర్తుగా ఇలా చేసేవారు మధ్య
యుగములోనైతే ప్రజలు గుడి నుండి స్మశాన
వాటికకు పాటలు పాడుకుంటూ ప్రదక్షిణగా
వెళ్లేవారు తిరిగి అదే ప్రదక్షిణగా
వచ్చేటప్పుడు ఒక గురువు బాల యేసు
స్వరూపాన్ని పట్టుకొని ఎదురు వచ్చేవారు ఇక
అందరూ జకరియా పాడిన ప్రవచన గీతాన్ని లూకా
ఒకటవ అధ్యాయం 68 నుండి 79 వచనాల వరకు
ఆలాపించుచు
లేక చదువుచు గుడిలోనికి ప్రవేశించి పిమ్మట
బలి పూజలో పాల్గొనేవారు ఈ పండుగ ద్వారా
మనం కూడా దేవునికి కానుకగా అర్పించుకుంటూ
ఇప్పుడు ప్రార్థిద్దాం
ప్రార్థించుదము కరుణా స్వరూపులైన పరిశుద్ధ
తండ్రి ఈరోజు బాల యేసును దేవాలయంలో
సమర్పించినటువంటి పండుగను
స్మరించుకునేటటువంటి అవకాశాన్ని మాకు
కలిగించినందుకు మీకు కృతజ్ఞతలా స్తుతులు
అర్పిస్తూ ఉన్నాము ప్రభువా ప్రతి వ్యక్తి
మీ నుంచి వచ్చారు మీకు చెంది ఉన్నారు
తిరిగి మీ వద్దకే వెళ్ళాలి అని అన్నటువంటి
సత్యాన్ని ఈరోజు దివ్య బాల యేసుని
దేవాలయములో అర్పించినటువంటి పండుగ గుర్తు
చేస్తూ ఉంది మా జీవితములను కూడా మీకు
అర్పించుకునేటటువంటి విశాల ఉదారమైనటువంటి
మనస్సును మాలో
కలిగించండి పరిశుద్ధ మరియ తల్లి జోజెఫ్
గారి వలె ప్రతి కతోలిక తల్లిదండ్రులను
తయారు చేసి వారి బిడ్డలను సన్మార్గములో
దేవుని మార్గములో నడిపిస్తూ మీకు
అర్పించేటటువంటి మంచి మనసును ప్రతి కతోలిక
తల్లిదండ్రులకు అనుగ్రహించమని ఈ పండుగ
రోజున మా నాధుడును మీ కుమారుడైన క్రీస్తు
ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమెన్
UNLOCK MORE
Sign up free to access premium features
INTERACTIVE VIEWER
Watch the video with synced subtitles, adjustable overlay, and full playback control.
AI SUMMARY
Get an instant AI-generated summary of the video content, key points, and takeaways.
TRANSLATE
Translate the transcript to 100+ languages with one click. Download in any format.
MIND MAP
Visualize the transcript as an interactive mind map. Understand structure at a glance.
CHAT WITH TRANSCRIPT
Ask questions about the video content. Get answers powered by AI directly from the transcript.
GET MORE FROM YOUR TRANSCRIPTS
Sign up for free and unlock interactive viewer, AI summaries, translations, mind maps, and more. No credit card required.