ఇలాంటి అన్యాయం నీ ఇంటిలో జరగకుండా జాగ్రత్త తీసుకో! |Pas B.Jeremiah|EmmanuelMinistriesHyderabad
FULL TRANSCRIPT
సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు
ఏసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామంలో
ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురుచూస్తున్న
మీ అందరికీ ఇమ్మానియల్ మినిస్ట్రీస్ తరపున
మా శుభాభివందనాలు తెలియజేస్తూ
క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన
దైవజనాంగమా ఎలా ఉన్నారు?
ఈ వారమంతా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా
సాగుతూ వచ్చింది మంచిది ఈరోజు శనివారం కదా
ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన వారంలో
ఒక్కసారైనా
ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి
మన కుటుంబాలకు ఊపిరి ఆధ్యాత్మిక
జీవితానికి ఉజ్జీవం
ఉపవాస ప్రార్థన కాక మరొకటి ఏది కాదు కదా
అపవాది క్రియలపై విజయ ధ్వజాన్ని స్థా
స్థాపించేది ఉపవాస ప్రార్థనే కదా
తప్పకుండా
మీకు అనుకూలమైన దినాన ఉపవాసించి
ప్రార్థించండి.
రేపు ఆదివారం కదా సెంట్రల్ మందిరంలో
నాలుగు ఆరాధనలు జరుగుతాయి. అలాగే ఉప్పల్లో
మూడు ఆరాధనలు పటాంచెరువులో ఆదివారం
సాయంకాలపు ఆరాధన ప్రారంభించాం.
దేవుని కృప గత ఆదివారం అనేకమంది నూతన
ఆత్మలను క్రొత్తగా ప్రారంభించబడిన
పటాంచెరు పరిచర్యకు ప్రభువు నడిపించారు.
ప్రార్థించిన మీ అందరికీ మా నిండు
కృతజ్ఞతలు ప్రత్యేకంగా రేపు ఆదివారపు
ఆరాధనలో సెంట్రల్ మందిరంలో ఫస్ట్ సెషన్
5:45 కి నక్క జిత్తులు చిత్తు చేసిన
దేవుడు జిత్తులు మారినక్క చిత్తు చేసిన
దేవుడు దివ్యమైన వర్తమానం సెకండ్ సెషన్ లో
కొందరి గుండె లబ్ డబ్బు అంటుంది మరి
కొందరి గుండె డబ్బు డబ్బు అంటుంది అవునా
అవును క్రీస్తు గుండె ఏమంటుంది దివ్యమైన
వర్తమానం థర్డ్ సెషన్ లో సంఘంలో ఉండే ఐదు
రకాల మనుషులు తప్పకుండా వినండి అలాగే
పటాంచెరువులో నూతనంగా ప్రారంభించబడిన
ఆదివారం సాయంకాలపు ఆరాధన ఆరు గంటల
8:30ర వరకు ఎరిగిన వాళ్ళందరికీ షేర్
చేయండి మంచిది ఈ దినం మరో దివ్యమైన
వర్తమానం
ఇలాంటివి మన కుటుంబాల్లో మన సంఘాల్లో
లేకుండా
జాగ్రత్తగా చూసుకుంటే భావితరాలకు
అది ఆశీర్వాదం
ఏది ఉండకుండా చూసుకోవాలన్నా అని అంటారా
కుటుంబాల్లో ఒకరిని ఒక రకంగా ప్రేమించటం
ఇంకొకరిని ఇంకో రకంగా ప్రేమించటం
పక్షపాతం చూయించే ఈ ధోరని ఇటు కుటుంబాల్లో
అటు బంధువుల మధ్యలో చివరికి ఈ జాడ్్యం
సంఘాల్లో కూడా చోటు చేసుకున్నట్లుగా
దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం
అనుభవిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్లో హెచ్చు తగ్గులు గల వేరు వేరు
తూనికరాళ్లుు
యెహోవాకు హేయం బైబిల్ లో ఒక స్థలంలో రాసి
ఉంది ఎక్కడో కింద కామెంట్ బాక్స్ లో
రాయండి దైవజనుమా
త్రాసు తూసేటప్పుడు
వేరు వేరు తూనికరాలు
కుటుంబంలో మనుషులను ప్రేమించేటప్పుడు
వేరు వేరుగా తూనికేసి ప్రేమించటం
అది దేవుని వాక్యానికి భిన్నం
వినాశనానికి కారణం అవుతుంది.
ఇలా వేరు వేరు తూనికరాలతో
పక్షపాతపు ప్రేమ చూపించడాన్ని బట్టి
బ్రతుకులు ఏమైపోయాయో చెప్తాను ఈరోజు
చాలామంది మా దగ్గరికి వచ్చి కొంతమంది
కొడుకులు చెప్తారు నాన్న
మా అమ్మే మమ్మల్ని శత్రువులుగా చూస్తది.
మా చెల్లి పిల్లల్ని మంచిగా ప్రేమిస్తది
మా అక్క పిల్లల్ని మా అక్కని మంచిగా
ప్రేమిస్తది
నేనన్నా నా పిల్లలన్నా నా భార్య అన్నా
గోంగూరలో పురుగు చూసినట్టు చూస్తది అన్నా
కొంతమంది మగబిడ్డలు ఏడుస్తారు మరి
కొంతమంది ఆడపిల్లల
ఆడపిల్లల పిల్లల్ని మా చెల్లి పిల్లల్ని
చాలా బాగా ప్రేమిస్తారు
మా పిల్లల్ని ప్రేమించరాన్న
కొంతమంది
ఇంకొంతమంది బాధ ఏంటో తెలుసా
మగపిల్ల
మా అన్నయ పిల్లల్నే మగపిల్లల పిల్లల్నే
ప్రేమిస్తారు కానీ ఆడపిల్లలం అసలు వాళ్ళు
మమ్మల్ని కన్నారో లేదో అన్నట్లుగా
ఇదన్నా పక్షపాతపు ప్రేమ అని ఎన్నో చోట్ల
ఎక్కడికి వెళ్ళినా ఈ గుండె కోత
మిగిల్చేటువంటి మాటలు ఏ స్థలంలో చూసినా
వింటా వస్తా ఉంటాం
ఒకళళనొకళని
ఒక రకంగా ప్రేమించడం అన్న మా అత్తకి వాళ్ళ
కూతురు అంటే మహా ప్రేమ అన్న
కూతురుకు పంచిన ప్రేమలో ఇంత ప్రేమ కూడా
నాకు పంచదన్న కోడలు వాపోతూ ఏడుస్తాయి
చివరికి జాడ్యం సంఘాల్లో కూడా జొరబడింది.
ఏం జరుగుతుందో చెప్తాను
ఇస్సాకు రెబకాలకు
ఏషావు యాకోబు
వీళ్ళ ఎంత మంచి తల్లిదండ్రులో చూడండి
ఇస్సాకు ఏషావును ప్రేమించాడట
రెబక్క
యాకోబును ప్రేమించిందట
ఏంటి ఇస్సాకు అయ్యా ఇస్సాకు
యాకోబు నీకు పుట్టినోడు కాదా అంటే ఏం
పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు యాకోబు
నాకు పుట్టకపోవటం ఏంటి మరి నీకు
పుట్టినోడైతే
యాకోబుని ఎందుకు ప్రేమించవయ్యా
అడగండి
రెబుకమ్మ దగ్గరికి వెళ్లి ఏమ్మా రెబకమ్మ
ఏషావు నీ కొడుకేనా
ఏం పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు
ఏషావు నా కొడుకు కాకపోతే ఇంకెవరి కొడుకు
అవుతాడు కానీ పెంచింద దాన్ని ప్రసంగం మానే
చేస్తున్నావ్ కానీ అమ్మ రెబకమ్మా మరి
ఏషావుని ఎందుకు ప్రేమి ప్రేమించలా
ఒకళళని ఒక రకంగా ప్రేమించి ఇంకొకళని ఒక
ఏంటి ఇద్దరిని పంచుకోవటానికి వాళ్ళఏమనా
కేకు ముక్కలా ఆ పంచుకోవటానికి వాళ్ళఏమనా
భూమా పంచుకోవటానికి భాగాలు వేసుకోవటానికి
వాళ్ళఏమనా ఆస్తి
ఏం తల్లిదండ్రులు
కొన్ని కుటుంబాల్లో కూడా
మా అమ్మ పెద్దోడిని ఎక్కువ ప్రేమిస్తది
అన్నా నేను చిన్నోడిని నన్ను ప్రేమించదన్న
మా నాన్న పెద్దోడిని ఎక్కువ ప్రేమిస్తాడు
అన్నా నన్ను ప్రేమించడన్నా
మీ కుటుంబాల్లో ఇది ఉందా
ఏం జరిగింది యాకోబు యేషావులు అట్లా
పంచుకోవటాన్ని బట్టి జీవితాంతం
వాళ్ళు బద్ధ శత్రువులుగా మారిపోయారు.
యాకోబు యేషావులు ఎక్కడైనా కలిసి భోజనం
చేసిన దాఖలాలు గాని కలిసి సంతోషంగా
మాట్లాడుకున్న దాఖలాలు గాని ఎక్కడి వరకు
మలాకి గ్రంథం వరకు మలాకి గ్రంథం వరకు
వాళ్ళ మధ్యలో ద్వేషమేగా
అమ్మా ఆ పక్షపాతపు ప్రేమ చూపించడాన్ని
బట్టి నీ కడుపును పుట్టిన బిడ్డలు బద్ద
శత్రువులు అయిపోతారు ఆ ద్వేషానికి బీజం
వేసింది నీ పెంపకం కాదా ఆ ద్వేషానికి బీజం
వేసింది అయ్యా నీ పెంపకం కాదా ఒకసారి
ఆలోచించండి
ఒకవేళ మీరు అనొచ్చు నేను పల వాడిని
ప్రేమించడానికి కారణం ఏంటంటే వాడు మంచోడు
కాబట్టి అన్నా ఈని ఎందుకు ప్రేమించను అంటే
వాడిలో ప్రేమించదగ్గ లక్షణాలు లేవన్నా అని
అంటారా
నీలో నాలో
దేవుడు మనలను ప్రేమించడానికి చెప్పుకోదగ్గ
ఏ మంచి లక్షణాలు ఉన్నాయి చెప్పండి
కారణం లేకుండానే హేతువు లేకుండానే
ప్రేమించాడు అందుకనే ఈరోజు యేసులో మనం
కట్టబడటానికి దేవుడు కృప చూపించాడు
రెండవది
యాకోబుకు 12 మంది కొడుకులు రైట్ యాకోబుకు
12 మంది కొడుకులు యాకోబు ఎవరిని ఎక్కువ
ప్రేమించాడు
యోసేపుని సరే ప్రేమిస్తే ప్రేమించాడు
గుండెల్లో దాసుకోవాలిగా ఆ ఏం చేసాడో
తెలుసా యోసేపుకు విచిత్రమైన వస్త్రాలతో
కూడుకున్న అంగి అంగి
ఇచ్చాడంట మరి సతిమా వాళ్ళకి
ప్రతిమగులకి
ఈయనకే విచిత్రమైన అంగి విచిత్రమైన అంగి ఆ
విచిత్రమైన అంగి ఆ రోజుల్లో ఎవరు
వేస్తారయ్యా అంటే అధికారం అధికారానికి
గుర్తుగా ఆ విచిత్రమైన అంగి వేస్తారట
అంటే
అంటే ఒక మాట వీడేమ అధికారి కావాలి వీళ్ళేం
బానిసలు కావాలా
మీరు అన్నది దేవుని దర్శనం కదా అని
అనొద్దు ఈ అన్నదమ్ముళ్ళ మధ్య మధ్యలో కలహం
పెట్టింది ఎవరు యాకోబు అడుగుదాం
యాకోబు నాయనా యాకోబు ఏమయ్యా
మొదట పుట్టిన 10 మంది కొడుకులు నీ
కొడుకులు కాదా అని అన్నామ అనుకో బాబు ఏం
మాట్లాడుతున్నావయ్యా జరిమే పాస్టర్ గారు
వాళ్ళు నా కొడుకులు కాకపోవడం ఏంటి మొదటి
నలుగురు
లేమకు పుట్టినోళ్ళా ఆ తర్వాత దాసీలకు
పుట్టినోళ్ళా ఆ తర్వాత రాహేలుకు
పుట్టినోళ్ళా అవును లేటుగా పుట్టిన
యోసేపుని ఎందుకు అంత ప్రేమించావ్ చూడండి ఆ
పక్షపాతపు ప్రేమ యోసేపు పట్ల చూపించడానికి
కారణాన్ని బట్టే 10 మంది కొడుకులు
నరహంతకులుగా ముద్రించబడ్డారు
యాకోబు ఇలాంటి బుద్ధి నీకు ఎక్కడి నుంచి
వచ్చిందయ్యా అని అన్నామ అనుకో ఏమంటాడో
తెలుసా యాకోబు గారు నాకు కొత్తగా ఏమి
రాలేదు సార్ మా అమ్మ అదే చేసింది నేను అదే
చేశను ఆ మా నాన్న అదే చేశాడు నేను అదే
చేశను వంశ పారంపర్యం
అమ్మ
నీ దగ్గర ఆ పక్షపాతపు స్వభావం నీ పిల్లలు
చూస్తే అదే మనస్తత్వం అదే మనస్తత్వం
ఓ మాట అంట
ఆ పక్షపాతం ఏం చేసింది అన్నదమ్ముల మధ్యలో
అసూయ పుట్టడానికి ఒకరంటే ఒకరికి పడని
వారుని తను చివరికి తమ్ముని చంపటానికి
కూడా వెనుతియని ఆ భయంకరమైన పరిస్థితి వారి
జీవితాల్లో దాపరించింది.
నీ అన్నదమ్ముల మధ్యలో నీ అక్క చెల్లెల
మధ్యలో వాళ్ళకు నువ్వు ఆస్తి పంచి
పెట్టకపోయినా పర్వాలేదు బిడ్డ విను వాళ్ళు
బ్రతికున్న దినాల్లో మా అక్క మా చెల్లి మా
తోబుట్టు
మా వదిన మా ఇంటి ఆడపడుచు
మా ఇంటి ఆడబిడ్డ
మా ఇంటికి వచ్చిన కోడలు మా అన్నయ
కుమార్తెలు మా తమ్ముడు కుమారులు
ఆ ఆప్యాయిత కుటుంబంలో ఉండేటట్లుగా చేయండి.
ఈ పక్షపాతపు బుద్ధి వల్ల కుటుంబం చూడండి
ఏమైపోయిందో ఇంకో మాట చెప్తాను
యాకోబు లేయమ్మ రాహేలు
రాహేలు లేయ ఎవరు
సొంత అక్కా చెల్లెలే కదా యాకోబు
చెల్లిని ప్రేమించాడు అక్కను ప్రేమించల
ఇద్దరిని వివాహ వ్యవస్థ ద్వారా తన భార్యగా
చేసుకున్నాడు
రాహేలుకు ప్రేమంత త కుమ్మరించాడు ఒక మాట
అడుగుతా ఏవమ్మా రాహేలమా నా వైపు చూడాల
ఏవమ్మా రాహేలమా
మీ ఆయన
లేయమని ప్రేమిస్తున్నాడా నిన్ను ఎక్కువ
ప్రేమిస్తున్నాడా
అప్పుడు రాహేలం ఏమఉంటదో తెలుసా నా వైపు
చూడండి ఇట్లాని మా ఆయన బంగారం నన్ను
గుండెల్లో పెట్టి చూసుకుంటాడు నేను
లేకుండా బతకలేడు కూర్చున్న రాహేలు అంటాడు
లేసినా రాహేలుమంటాడు పండుకున్న రాహేలు
అంటాడు ఏ పని చేస్తున్న లాహేలు లాహేలు
లాహేలు నా రాహేలు 24 గంటలు నా ద్యాసే
నన్నుంత ప్రేమించాడు.
బుద్ధి లేని రాహేలు
మరి నీ అక్క ఎంత బాధపడుతుందో ఎప్పుడైనా
ఆలోచించావా
ప్రేమంతా నీకే పంచితే
మరి నీ అక్క కూడా యాకోబు భార్యేగా
నీకంటే ముందు కదా పెద్ద ఆవిడ కదా మరి ఆ
భర్త అదే నీ భర్త నీ అక్కను ప్రేమించకపోతే
ఒక్క మాట చెప్పొచ్చుగా అయ్యా నాకు
ఏడుస్తుంది
మొత్తం ప్రేమ నాకు ఒక్కదానికి పని పంచితే
ఎట్లా నాకు కూడా పంచండి అని అనొచ్చుగా ఆ
బుద్ధి జ్ఞానంతో తనకు ఉండాలిగా అక్కాజలారా
మీ తండ్రికి మీరిద్దరు కుమార్తెలు
అనుకోండి
నీ తండ్రి నీకు మూడు ఎకరాలు పొలం ఇచ్చి
నీ సహోదరికి ఒక ఎకరం ఇస్తే
నీకు మూడు ఎకరాలు ఇచ్చాడు ఎగిరి గంతు
వేస్తావా నాన్న ఇది ధర్మం కాదు చస్తా
చస్తా ఆస్తి మనతో తో పాటు తీసుకొని
వెళ్ళలేను న్యాయం
దానికి రెండు నాకు రెండు చెరుసగం న్యాయం
అని న్యాయంగా తీసుకుంటున్నావా అబ్బా మా
నాన్న మా నాన్న నాకే ప్రేమ పంచాడు మా అమ్మ
నాకే ప్రేమ పంచింది మా తాత నాకే ప్రేమ
పంచాడు వాళ్ళు ఎవరో నీకు మాత్రమే పంచారని
ఎగిరి గంతులు వేసే
అలాంటి పక్షపాతపు స్వభావం నీలో ఉందా
తస్మాత్ జాగ్రత్త
ఆలోచించు
ఆలోచించు
మీ తండ్రికి 10 ఎకరాలు
నీకు ఒక్కడికే ఏడు ఎకరాలు రాసి
మీ అన్నకు పెద్దోడికి మూడు ఎకరాలు రాస్తే
అబ్బా మా నాన్న నాకు ఏడు ఎకరాలు
పంచిపెట్టాడు మొత్తం పొలవంతా నాకే ఇచ్చాడు
మా నాన్న నన్న అంత ప్రేమించాడు అని
సంతోషంగా తీసుకుంటున్నావా
వేరు వేరు తోనికరాలు యెహోవాకు హేయము
ఇలా పక్షపాతం చూపించటం ఇది నాకు ఆశీర్వాదం
కాదు డాడీ తప్పు పెద్దోడికి ఐదు నాకు ఐదు
ఇంట్లో నలుగురం ఎస్
రెండున్నరెండున్నరెండున్నరెండున్నర
వద్దు సమానంగా పంచుకుందాం అని అంటున్నావా
నీకు ఎక్కువ వచ్చిందని రాహేల్లా గంతులు
వేస్తున్నావా ఏం జరిగింది ప్రేమంతా నాకే
పంచుతున్నాడని రాహేలమ గంతులు వేసింది
ఏం జరిగిందో తెలుసా మార్గ మధ్యలోనే
చచ్చిపోయింది
అనుభవించలేకపోయింది.
మోసపూరితంగా
పక్షపాతంగా
సమాన తత్వం లేకుండా నువ్వు ఎక్కువ
తీసుకుంటే
దాన్ని అనుభవించలేవు
నేను శపిస్తున్నాను అనుకోకండి
శపిస్తున్నాను అనుకోకండి మిమ్మల్ని
హెచ్చరిస్తూ ఉన్నాను అనుభవించకుండానే
అర్ధాయుషుతో
భర్త ప్రేమ పొందుకోకుండానే
దాన్ని అనుభవించకుండానే రాహేలము భూమిమీద
నుంచి వెళ్ళిపోయింది
ఒకవేళ దొంగ కాగితాలు పుట్టించి మోసం చేసి
నీ తోబుట్టులతో లాక్కున్నావేమో జాగ్రత్త
అనుభవించవు నీ పిల్లలు అనుభవించరు
నీకు ఎవరైనా మోసం చేసి పక్షపాతం చూపించి
నువ్వు మోసపోయావా
ఓపిక పట్టు ఇక్కడ ఒక అద్భుతమైన మాట
చెప్తాను
యేసయ్యకి ఎనిమిది మంది కుమారులు
సమూయేలు ప్రవక్త
యషయ్య ఇంటికి వచ్చాడు విన్నారా యషయ్య
ఇంటికి వచ్చి అయ్యా నీ కుమారులందరినీ
పిలువు నేను బలి ఇవ్వబోతున్నాను ఇక్కడ నీ
కుమారులో ఒకడిని రాజుగా దేవుడు
ఎన్నుకోబోతున్నాడు
నీ కుమారులందరినీ పిలువు అంటాడు ఏవండీ అంత
గొప్ప సేవకుడు తన ఇంటికి వస్తే
కుమారులందరినీ పిలవమంటే ఏడుగురిని
పిలిచాడు విన్నారా ఎవరు సమూయేలు ప్రవక్త
మానవ భాషలో చెప్పాలంటే ఆయన ఇంటర్నేషనల్
స్పీకర్
మొత్తం దాను మొదలుకొని బైర్షభ వరకు
ప్రఖ్యాతిగంచిన ప్రవక్త అంత గొప్ప
దైవజనుడు తన ఇంటికి వస్తే పిల్లలందరినీ
పిలిచి వీడు పెద్దోడయ్యా ప్రార్థన చెయ్
వీడు రెండోవాడయ్యా ప్రార్థన చెయ్ వీడు
మూడోవాడయ్యా ప్రార్థన చెయ్ వీడు
నాలుగోవాడయ్యా ప్రార్థన చెయ్ వీడు ఐదో
వాడయ్యా ప్రార్థన చెయ్ వీడు ఆరో వాడయ్యా
ప్రార్థన చెయ్ వీడు ఏడోవాడయ్యా ప్రార్థన
చెయ్ ఇదిగో ఇదిగో వీడేనయ్యా చివరోడు
కడసారిగా పుట్టినోడు వీడు ఎనిమిదో వాడయ్యా
ప్రార్థన చెయ్ అని తండ్రి కొడుకుల అందరినీ
చూయించాలా
ఎంత పక్షపాతపు దోరణ అక్కడ చూసి ఇప్పుడు
నేను ఒక మాట అంటా
సరే తండ్రి పిలవకపోతే పిలవకపోయాడు తల్లి
ఏం చేసింది సరే తల్లి పిలవల ఈ ఏడుగురు
ఉన్నారే ఏడే అడు చిన్న చిన్నోడిని
పిలవలేదు ఏంటి ఆడే వాడిని పిలుచుకోరండి
అని అనాలిగా
ఏడుగురు చేత మరవబడ్డాడు దావీదు
పక్షపాతానికి గురయ్యాడు దావీదు
ఏడుగురి చేత మరవబడిన వాడిని మహోన్నతుడైన
దేవుడు జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు.
తమ్ముడు చెల్లి ఎందుకు అందరూ నిన్ను
చులకనగా చూస్తున్నారా
హేళనగా చూస్తున్నారా
చిన్నచూపు చూస్తున్నారా
ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా
నీ పేరెత్తితే మూలన పెడుతున్నారా నీ
ఇంటివారి ద్వారా నీకు అన్యాయం జరిగిందా నీ
తోబుట్టుల ద్వారా నీకు అన్యాయం జరిగిందా
కన్నతండ్రే
నీకు అన్యాయం చేశాడా కన్నతల్లే
నీ గొంతు కోసిందా
నీ సొంత తోబుట్టువే
నిన్ను మోసం చేశాడా నీ ఎంగిలి పాలు
త్రాగిన త్రమ్ముడే నీ ఎంగిలి పాలు తాగిన
చెల్లే
నీ తర్వాత పుట్టినవాడే
నీకు మోసం చేశాడా అన్నా అన్నా అన్న అని
అనుకుంటూ మా అన్న అని అంటూ ఉంటే ఆ అన్నే
నీకు గోతులు తవ్వాడా ఎవరు నిన్ను మోసం
చేశారు ఎవరు నిన్ను చులకం చేశారు ఎవరు
ఎవరు నీ పట్ల పక్షపాతం చూయించారు
ఒక శుభవార్త
మనుషులు నిన్ను చిన్న చూపు చూస్తే
మహోన్నతుడైన దేవుడు నీ మీదే దృష్టి
నిలిపాడు నీకు ఇక్కడఒక విలువైన మాట
అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను చూడండి
అక్కడ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం
11వ వచనం నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా
అని యషీను అడగగా అతడు ఇంకను కడసారి రివాడు
ఉన్నాడు అయితే వాడు గొర్రెలను
కాయుచున్నాడని చెప్పెను అందుకు సమూయేలు
నీవు వారిని పిలవ నంపించుము
అతడు ఇక్కడికి వచ్చు వరకు మనము
కూర్చుందుమని యషయ్యతో చెప్పగా
ఏంటఏంటిఏంటంటే
చూడండి చివరి మాట అతడు ఇక్కడికి వచ్చు
వరకు
ఆ మనము ఇక్కడ కూర్చుందుమని యషయ్యతో
చెప్పగా విన్నారా
ఇది చూశరా దావీదు లేడు అక్కడ ఏమంటాడు
అతన్ని పిలవనంపండి అతడు ఇక్కడికి వచ్చే
వరకు మనం ఇక్కడే కూర్చుందాం.
ఇప్పుడు దావీదు ఏమయ్యాడో తెలుసా సెలబ్రిటీ
అయ్యాడు
దావీదు వచ్చేదాకా అందరూ అక్కడే
కూర్చున్నారు ఏవండీ ముఖ్యమంత్రి ఎప్పుడో
సాయంత్రం నాలుగుింటికి సభ అంటాడు ఎప్పుడో
నాలుగుింటికి ప్రారంభం కాదు ఆయన ఎప్పుడో
ఆరింటికి వస్తాడు ముఖ్యమంత్రి గారు
వస్తారు ముఖ్యమంత్రి గారు వస్తారు
ముఖ్యమంత్రి గారు వస్తారని ఉదయంమూడు గంటల
నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా జనాలు
బారులు తీసుకొని వెయిట్ చేస్తా ఉంటారే
ముఖ్యమంత్రి కోసం వెయిట్ చేస్తున్నట్లుగా
సమూయేలు ప్రవక్త ఏడుగురు అన్నలు యషయ
వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు
ప్రధానమంత్రి ఈరోజు సాయంత్రం ఐదంటికి
వస్తాడు అనౌన్స్మెంట్ చేస్తే గ్రామ
గ్రామాల నుంచి జనాలు వస్తారు ప్రధానమంత్రి
వస్తున్నాడు వస్తున్నాడుఅని
మూడు నాలుగు ఐదు ఆరింటి దాకా ఇంకా రాలేదు
వస్తాడు వస్తాడని ప్రజలంతా ఆతృతో ఎదురు
చూస్తున్నట్లు సీఎంలు
మినిస్టర్లు కేంద్ర మంత్రులు ఐఏఎస్
ఆఫీసర్లు అందరూ ఎదురు చూస్తున్నట్లు
ప్రధానమంత్రి రాక కోసం
దావీదు ఇక్కడ సెలబ్రిటీ అయ్యాడు
ఆ పక్షపాతానికి గెలుగుతున్నావా
ఒకరోజు వస్తాది నిన్నే సెలబ్రిటీగా దేవుడు
మారుస్తాడు.
నిన్నే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా దేవుడు
నిలవబెడతాడు.
నీ రాక కొరకు అనేకులు ఎదురుచూసేటట్లుగా
నీ రాక కొరకు అనేకులు కాచుకునేటట్లుగా
ఒక అద్భుతమైన వింతైన వ్యక్తిగా దేవుడు
నిలవబెడతాడు.
పక్షపాతం చూయించుకో సంఘానికి ధనికుడు
వస్తాడు పేదోడు వస్తాడు సమాన ప్రేమ పంచు
అఫ్కోర్స్ సంఘానికి సహకరించేవాళ్ళు
సన్మానానికి యోగ్యులని రాసిఉంది దాన్ని
నేను కాదన్నాం కానీ ప్రేమను పంచే విషయంలో
ధనికుడు పేదవాడు అనే భేదం లేకుండా
చదువున్నవాడు చదువు లేనివాడు అనే భేదం
లేకుండా పక్షపాతము లేని ప్రేమ మనం కనపరిచే
వ్యక్తులుగా ఉందుము గాక పక్షపాతపు ప్రేమ
చూపించారు ఇస్సాకు యాకోబు సారీ ఇస్సాకు
రెబకాలు ద్వేషం పుట్టుకొచ్చింది
పక్షపాతం చూయించాడు యాకోబు
అసూయ పుట్టుకొచ్చి హత్య చేయటానికి కూడా
దాపురించారు
పక్షపాతం చూపించింది రాహేలు
అనుభవించకుండానే
పక్షపాతం చూపించాడు యషీ
పక్షపాతం పొందుకున్న దావీదే సెలబ్రిటీగా
మారిపోయాడు ఎక్కడ పక్షపాతం అనుభవిస్తున్న
మీరు డ్యూటీస్ లో వీళ్ళ క్రిస్టియన్స్
పక్షపాతం చూపిస్తున్నారు కదు స్కూల్స్ లో
కాలేజెస్ లో వీళ్ళ క్రిస్టియన్ పిల్లలు
అవహేలన పక్షపాతం స్కూల్ యాజమాన్యం ద్వారా
పొందుకుంటున్నారు కదు అదే ప్రాంతాలలో
సెలబ్రిటీగా
నిన్ను నీ పిల్లలను దేవుడు
నిలవబెట్టబోతున్నాడు ప్రార్థన చేస్తాను
తండ్రి మాతో మీరు మాట్లాడిన మాటలకై
స్తోత్రాలు భయంకరమైన దినాల్లో
బ్రతుకుతున్నాం ప్రేమ ఆప్యాయితులు కరువైన
దినాల్లో బ్రతుకుతున్నాం ఎక్కడ చూసినా
పక్షపాతం పక్షపాతం ఆ దురాత్మ పాతాళములో
త్రొకివేయబడును గాక దేవుడు పక్షపాతి కాదు
అవును నాయనా యూధుడని గ్రీసు దేశస్తుడని
భేదం లేకుండా అందరికీ ప్రేమను పంచిన
దేవుడవు మాకు కూడా నీ ప్రేమ
పంచుతున్నందుకు స్తోత్రాలు పక్షపాతం లేని
సంఘాలుగా పక్షపాతం చూపని వ్యక్తులుగా
కుటుంబాలను సంఘాలను కట్టుకునే కృప మాకు
దయచేయ్ పక్షపాతం అనే ఈ గుణం మా
కుటుంబాల్లో లేకుండా మా కుటుంబాలను ధన్యం
చేయమని ప్రార్థన చేస్తూ ఎవరైతే
పక్షపాతానికి గురైపోయారో వారిని
సెలబ్రిటీలుగా మారుస్తాను అన్నావ్
దావీదును సెలబ్రిటీగా చేసినట్లు ఈ వాక్యం
విన్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు ఈ కార్యం
చేయుదురు గాక యేసు నామములో ప్రార్థించి
పొందియున్నాం తండ్రి ఆమెన్ తండ్రి అయిన
దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి
దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం
మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి
నడిపించును గాక ఆమెన్ ఆమెన్ థాంక్యూ
UNLOCK MORE
Sign up free to access premium features
INTERACTIVE VIEWER
Watch the video with synced subtitles, adjustable overlay, and full playback control.
AI SUMMARY
Get an instant AI-generated summary of the video content, key points, and takeaways.
TRANSLATE
Translate the transcript to 100+ languages with one click. Download in any format.
MIND MAP
Visualize the transcript as an interactive mind map. Understand structure at a glance.
CHAT WITH TRANSCRIPT
Ask questions about the video content. Get answers powered by AI directly from the transcript.
GET MORE FROM YOUR TRANSCRIPTS
Sign up for free and unlock interactive viewer, AI summaries, translations, mind maps, and more. No credit card required.