ఆలయంలో రక్షకుని సమర్పణ పండుగ - Fr. Pathivada Joseph Prabhakar
FULL TRANSCRIPT
క్రీస్తు నాధుని యందు ప్రియ సహోదరి
సహోదరులారా ఈరోజు మనము ఆలయమందు
రక్షకుని సమర్పణ పండుగను కొనియాడుతూ
ఉన్నాము ఇది సామాన్య కాలములోని నాలుగవ
ఆదివారం అయితే ఈరోజు ఫిబ్రవరి రెండవ
తారీకు మన దైవార్చన క్యాలెండర్ ప్రకారము
ప్రతి సంవత్సరము ఫిబ్రవరి రెండవ తారీఖున
మనము ఆలయమందు రక్షకుని సమర్పణ పండుగను
కొనియాడుతాం మరి ఈ పండుగ యేసు ప్రభువుకు
సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఆదివారం
అయినప్పటికీ కూడా ఈ పండుగ ఈ పండుగకు
సంబంధించినటువంటి పట్టణాలనే మనము
తీసుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మనము
ధ్యానించడానికి మన ముందు
ఉంచబడుతున్నటువంటి సువార్త పట్టణము లూకా
సువార్త రెండవ అధ్యాయము 22 నుండి 40 వరకు
ఉన్న
వచనాలు ప్రియ సహోదరి సహోదరులారా మనము ఈ
వాక్య
భాగాన్ని ఎన్నో సార్లు ఆలకించి ఉన్నాం
మరియా
యోసేపులు బాల యేసుని 40 వ దినాన ఎరుషలేము
దేవాలయానికి తీసుకొని వచ్చి అక్కడ ఆ
బాలుని సమర్పించినటువంటి
ఘట్టము మనము ఈ వాక్య భాగంలో
ఆలకిస్తాం మరి ఈ వాక్యం ఆధారంగా ప్రభువు
మనకి ఇస్తున్నటువంటి కొన్ని సందేశాలను
మనము ఈరోజు
స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియ
సహోదరి సహోదరులారా మనము ఈ వాక్య భాగము
నుండి ఐదు
ముఖ్యమైనటువంటి సందేశాలను
గ్రహించవచ్చు మొట్టమొదటి సందేశం ఏమిటి
అంటే మరియమాత
యోసేపు బాల యేసుని ఏ విధంగా
దేవాలయంలో కానుకగా
సమర్పించారో అలానే మనము కూడా మన జీవితాలను
మన కుటుంబాలను మన కుటుంబ
సభ్యులను ప్రతి దివ్య బలి పూజలో దేవునికి
అంకితం చేయాలి మనలను మనము ప్రతి దివ్య బలి
పూజలో ప్రభువునకు సమర్పణ
గావించుకోవాలి ఇది ఒక
ముఖ్యమైనటువంటి విషయం ప్రియ సహోదరి
సహోదరులారా మన కతోలిక శ్రీ సభకు
చెందినటువంటి సభ్యులు
దివ్య బలి పూజను ఏ విధంగా పరిగణిస్తారు
అంటే ఈ దివ్య బలి పూజలో ఎటువంటి
క్రొత్తదనము ఉండడం లేదు అది ఎప్పుడూ జరిగే
విధంగానే జరుగుతూ ఉంది అనే విధంగా
విమర్శిస్తూ ఉంటారు అయితే క్రొత్తదనం
అనేటువంటిది ఎలా మనము ఆపాదించవచ్చు అంటే
మనము దివ్య బలి పూజలో పాల్గొనే ప్రతిసారి
కూడా మనలను మనము ప్రభువునకు
సమర్పించుకోవాలి ఇది ఒక విధానము దివ్య బలి
పూజను మనము ఒక
ముఖ్యమైనటువంటి ప్రార్థన అంశంగా
పరిగణించడానికి ప్రియ సహోదరి సహోదరులారా
యేసు ప్రభువును అలనాడు మరియ యోసేపులు
దేవాలయంలో కానుకగా సమర్పించినట్లుగా మన
జీవితాలను ప్రభువునకు
సమర్పించుకోవాలి అదేవిధంగా మన కుటుంబమును
కుటుంబములో ఉండేటువంటి సమస్యలను
కుటుంబములో మనము
తలపెడుతున్నటువంటి కార్యములను మనము
చేయదలచుకున్నటువంటి ప్రతి కార్యాన్ని
ప్రభువునకు మనము సమర్పించుకొని
అనేటువంటిది అలవాటు చేసుకోవాలి అనేది మనకు
మొట్టమొదటిగా ప్రభువు ఈరోజు
తెలియజేస్తున్నటువంటి
విషయం ఇక రెండవ సందేశము ఈనాటి పండుగ మనకు
ఇస్తున్నటువంటిది ఏమిటి అంటే మరియా
యోసేపులు దేవుని ఆజ్ఞలను శిరసా
వహించినటువంటి వారుగా మనకు ఈనాటి వాక్యం
తెలియజేస్తూ మనము కూడా
దేవుని ఆజ్ఞలను పాటించేటువంటి వారుగా
మారాలి అని ప్రభువు మనకు సందేశాన్ని ఇస్తూ
ఉన్నారు వాస్తవానికి ప్రియ సహోదరి
సహోదరులారా మరియా యోసేపులు
దేవుని చేత ప్రత్యేకంగా
ఎన్నుకోబడినటువంటి వారు దేవుని యొక్క
ప్రణాళికలో భాగమైనటువంటి వారు వారు తమకు
తాముగానే ధర్మశాస్త్రము నుండి మినహాయింపు
ఇచ్చుకోవచ్చు వారు మేము ఈ ఆజ్ఞలను
పాటించాల్సినటువంటి అవసరం లేదు అని కూడా
వారు భావించవచ్చు కానీ వారు
ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను
శిరసా వహించడానికి వారు ప్రయత్నం
చేసినట్లుగా మనము ఈనాటి సువార్త పట్టణం
ద్వారా గ్రహించగలము ప్రియులగు సహోదరి
సహోదరులారా మరియ యోసేపులు బాల యేసును
దేవాలయానికి తీసుకొని వచ్చి బాల యేసుని
దేవాలయంలో కానుకగా సమర్పిస్తూ ఉండేటప్పుడు
వారు రెండు
ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను
పాటిస్తున్నట్లుగా మనము
గ్రహించగలము మొదటిది నిర్గమకాండము 13 వ
అధ్యాయము రెండవ వచనము మరియు 12 నుండి 13
వరకు ఉన్న వచనాలలో మనకు
కనబడుతుంది ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవుని
అంకితం చేయబడాలి అనేటువంటి
ఆజ్ఞ అలనాడు ఇశ్రాయేలీ ప్రజలు ఐగుప్తులో
ఉండేటప్పుడు వారిని ఐగుప్తు నుండి కనాను
దేశానికి తీసుకొని వెళ్లే క్రమములు
దేవుడు
ఐగుప్తులో చేసినటువంటి గొప్ప కార్యాలలో
ఒకటి వారి తొలిచూలు మగబిడ్డను కాపాడడం
దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలీ
ప్రజలు తమ యొక్క తొలిచూలు మగబిడ్డను
దేవునికి అర్పించాలి అనేటువంటి ఆజ్ఞ
వారికి ఇవ్వబడింది మరియా యోసేపులు ఆ
ఆజ్ఞను పాటించడం జరిగింది అదేవిధంగా ప్రియ
సహోదరి సహోదరులారా లేవియ కాండము 12వ
అధ్యాయము రెండు నుండి ఎనిమిది వరకు ఉన్న
వచనాలను చదివితే ఒక స్త్రీ ప్రసవించిన
తర్వాత మగబిడ్డను
ప్రసవించినట్లయితే 40 దినాల వరకు శుద్ధిని
కోల్పోతూ ఉంది అని అదే ఆడబిడ్డ
అయినట్లయితే
80 దినాల వరకు తన యొక్క శుద్ధిని కోల్పోతూ
ఉంది అని మనము వింటాం మరి ఈ ఆజ్ఞలను కూడా
మరియమాత పాటించడం అనేటువంటిది మనకు ఈనాటి
పండుగ తెలియజేస్తూ ఉంది ప్రియ సహోదరి
సహోదరులారా మరి ఈ విషయం మనకు మరియ
యోసేపులు ఏ విధంగా దేవుని ఆజ్ఞలకు శిరసా
వహించారో మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి
మన అనుదిన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను
మనము ఏనాడు త్రోసి పుచ్చకూడదు మనకు 10
ఆజ్ఞలు గాని లేదా మనకు యేసు ప్రభువు
ఇచ్చినటువంటి ఎన్నెన్నో ఆజ్ఞలు గాని మనము
ఎప్పుడూ కూడా
త్రోసిపంచకుండా వాటిని మన అనుదిన జీవితంలో
అనుసరించటానికి గట్టిదైన ప్రయత్నం చేయాలి
అనేది ఈరోజు పండుగ మనందరికీ
నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఇక మూడవ
విషయం ఏమిటి అంటే
దేవుని వాగ్దానాల కొరకు మనము ఓపికతో వేచి
ఉండాలి అనే సందేశాన్ని ప్రభువు మనకు ఇస్తూ
ఉన్నారు మనము ఈనాటి సువార్త పట్టణంలో
ఇద్దరు వృద్ధుల గురించి వింటాము ప్రియ
సహోదరి సహోదరులారా వారు సిమియోను మరి
ఇంకొకరు అన్నా అనేటువంటి ప్రవక్తి వారి
ఇరురువురు ఎంతో కాలము నుండి ఇశ్రాయేలీ
ప్రజల యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ
ఉన్నటువంటి వారే ఎప్పుడైతే బాల యేసును
వారు దేవాలయంలో చూశారో మరి వారికి
తెలియజేయబడినటువంటి ఆ వాగ్దానము
అనేటువంటిది నెరవేరునట్లుగా వారు భావిస్తూ
బాలుని చూసి స్తుతించడము ఆ బాలుని గురించి
దేవాలయంలో ఉండేటువంటి వారికి తెలియజేయడం
అనేటువంటిది మనము ఈనాటి సువార్త పట్టణంలో
వింటాం ప్రియ సహోదరి
సహోదరులారా ప్రభువు తన
వాగ్దానాలను ఏనాడు కూడా వెనక్కి తీసుకోరు
ఆ యొక్క వాగ్దానాలు ఆయన నెరవేర్చి
తీరుతారు హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ ఆరవ
అధ్యాయము 13 వ వచనంలో మనము ఈ విధంగా
చదువుతాం
దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు
తాను చేసిన వాగ్దానమును నెరవేర్తునని
ప్రతిజ్ఞ చేసెను తనకంటే అధికుడు మరియొకడు
లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ
వనర్చెను ఈ విధంగా ప్రియ సహోదరి
సహోదరులారా దేవుడు తన వాగ్దానాలను
నెరవేరుస్తారు కాబట్టి మనము ఓపికతో ఆయన
యొక్క వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు
చూడాలి అనేది ఈరోజు ప్రభువు మనకి
ఇస్తున్నటువంటి ఒక సందేశం మన జీవితంలో
కొన్ని
అవాంచనీయమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు
గాని ఏవైనా అనుకోకూడని శ్రమలు మనకు
సంభవించినప్పుడు మనము దేవుని
వ్యతిరేకించడం గాని దేవుని యొక్క
వాగ్దానాలను మనం మర్చిపోవడం గాని చేస్తూ
ఉంటాం కానీ ఏ సందర్భంలో కూడా మనము
దేవునికి దూరం కాకుండా ఆ దేవుని యొక్క
వాగ్దానాల మీద పూర్తిగా ఆధారపడి జీవించడం
అనేటువంటిది మనం చేయగలగాలి సిమియోను మరి ఈ
విధంగా దేవుని స్తుతించడం అనేటువంటిది
మనము చూస్తాం లూకా సువార్త రెండవ అధ్యాయము
29 వ వచనము
ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక
సమాధానముతో
నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు
ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని
దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానము
నెరవేరింది అనే
సంతోషంతో సిమియోను ఈ దాసుని ఇక సమాధానముతో
నిష్క్రమింపనిము అని కూడా ప్రార్థన చేశాడు
మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ సహోదరి
సహోదరులారా ఈరోజు ఈ పండగ నాడు మనము
పొందేటువంటి మూడవ సందేశము దేవుని
వాగ్దానాల కొరకు మనము ఓపికతో వేచి ఉండడం
అనేటువంటిది అలవాటు
చేసుకోవాలనేటువంటిది ఇక నాలుగవ
ముఖ్యమైనటువంటి సందేశం ఏమిటి అంటే మనము
దేవుని ఆత్మను ఆహ్వానించి చేటువంటి
వ్యక్తులుగాను మనలో
నిలుపుకునేటువంటి వ్యక్తులంగాను ఉండాలి
అనేది ఈ పండుగ మనకి ఇస్తున్నటువంటి ఇంకొక
సందేశం మనము సువార్త పట్టణంలో సిమియోను
గురించి ఆలకిస్తూ ఉండేటప్పుడు దేవుని ఆత్మ
ఆయన యందు ఉండెను అని క్రీస్తును చూచు వరకు
అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ
తెలియజేసినట్లుగాను పవిత్రాత్మ ప్రేరణతో
అతడు ఆలయానికి వెళ్ళినట్లుగాను మనకు
కనబడుతుంది ప్రియ సహోదరి సహోదరులారా మరి
ఆత్మతో
నింపబడినటువంటి సిమియోను
యేసు ప్రభువుని బాలునిగా దేవాలయానికి
తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు ఆ
బాలునిలో మెస్సయ్యను చూడగలిగారు మరి ఆ
బాలుని గురించి ఇతడు అన్యులకు
మార్గదర్శకమగు వెలుగు
ఇతడు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు
వెలుగు నేను దేవుని రక్షణను కనులారా
గాంచితిని అని అతడు చెప్పగలిగాడు
ప్రియులగు సహోదరి
సహోదరులారా ఆత్మ నడిపింపుతో మనము
జీవించినట్లయితే తప్పనిసరిగా
దేవుని యొక్క కార్యాలను అర్థం
చేసుకునేటువంటి వాళ్ళంగా మారుతాం ఆత్మను
మనలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి
పరిశుద్ధాత్మ అందరికీ జ్ఞాన స్నాన
సమయంలోనే
అనుగ్రహించబడింది మరి మనము ఆ
పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ జీవిస్తూ ఆ
ఆత్మ ప్రేరణలో మనము మన జీవితాలను
కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి ఆత్మను
మనము ఏనాడు కూడాను బాధ పెట్టకూడదు ఆత్మకు
ఏనాడు మనము విచారాన్ని తీసుకొని రాకూడదు
అని ఈరోజు ఒక సందేశంగా ప్రభువు మనకు మనకు
ఇస్తూ ఉన్నారు ప్రియ సహోదరి
సహోదరులారా ఇక ఆఖరిగా ఇంకొక
ముఖ్యమైనటువంటి సందేశం సిమియోను ప్రవక్త
మరియమాతతో
యేసు ప్రభువు గురించి తెలియజేస్తూ మరి
ఆమెకు సంబంధించి ఒక ఖడ్గము నీ హృదయమును
దూసుకొని పోనున్నది అనే ఒక ప్రవచనాన్ని
చెప్పడం అనేటువంటిది మనము సువార్త
పట్టణంలో వింటాం మరి ఈ ప్రవచనం
అనేటువంటిది ఎలాంటి సందేశాన్ని మనకి
ఇస్తుంది అంటే
భాగ్యముతో పాటు బాధలను కూడా
స్వీకరించేటువంటి మనుషులంగా మనం మారాలి
అని మరియమాతకు ఒక గొప్ప భాగ్యం ఇవ్వబడింది
ఆమె లోక రక్షకునికి
జన్మనిచ్చేటువంటి తల్లిగా భాగ్యాన్ని
పొందింది అయితే ఆ భాగ్యముతో పాటు తన
కుమారుని యొక్క బాధలను శ్రమలను మరణాన్ని
కూడా ఆమె చూడాల్సి వస్తుంది ఆమె బాధలను
కూడా పొందాల్సి వస్తుంది అనే విషయాన్ని
ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులకు
సహోదరి సహోదరులారా మన జీవితంలో కూడా
భాగ్యాలతో పాటు బాధలు కూడా వచ్చినప్పుడు
వాటిని సమానంగా స్వీకరించగలగాలి
భాగ్యాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ బాధలను
మనము తట్టుకొని లేకుండా ఆ సమయంలో మనము
దేవుని దూషించడం దేవునికి దూరం అవ్వడం
అనేటువంటిది సరికాదు అని ప్రభువు మనకు
ఈరోజు ఒక సందేశంగా మనకు తెలియజేస్తూ
ఉన్నారు ఈ విధంగా ఈ ఆలయమందు రక్షకుని
సమర్పణ పండుగ నాడు ప్రభువు మనకు ఇటువంటి
సందేశాలను ఇస్తూ ఉండగా ఈ సందేశాలను మన
అనుదిన జీవితంలో అనుసరిస్తూ వాటి
ప్రకారంగా మనము నడుచుకోవడానికి ప్రయత్నం
చేద్దాం ప్రార్థన చేసుకుందాం దయగల ప్రభువా
ప్రేమగల మా
తండ్రి ఈ పండుగ నాడు బాల యేసుని దేవాలయంలో
కానుకగా సమర్పించి ఉండగా మేము కూడా మా
బాధ్యతను గుర్తించుకునే వరం మాకు ఇవ్వండి
మమ్ములను మేము మీకు ఎల్లప్పుడూ
సమర్పించుకుంటూ సమర్పణ జీవితాలను
జీవించాలి అనే ఆ అవగాహనతో ఎల్లప్పుడూ ఉండే
వరాన్ని మాకు దయచేయండి ప్రభువా ఈరోజు
ప్రత్యేకంగా దైవాంకితులందరి కొరకు
ప్రార్థన చేస్తూ వారు తమను తాము
త్యాగపూరితంగా మీకు సమర్పించుకుంటూ ఉండగా
ఆ సమర్పణ జీవితాన్ని ఎల్లప్పుడూ తమ
మనసుల్లో
పదిలపరుచుకొని తమ జీవితాల ద్వారా మీకు
మహిమను చేకూర్చే విధంగా వారినందరినీ
ఆశీర్వదించమని మా ప్రభువైన యేసు నామమున
అడిగి వేడుచున్నాము తండ్రి ఆమెన్
UNLOCK MORE
Sign up free to access premium features
INTERACTIVE VIEWER
Watch the video with synced subtitles, adjustable overlay, and full playback control.
AI SUMMARY
Get an instant AI-generated summary of the video content, key points, and takeaways.
TRANSLATE
Translate the transcript to 100+ languages with one click. Download in any format.
MIND MAP
Visualize the transcript as an interactive mind map. Understand structure at a glance.
CHAT WITH TRANSCRIPT
Ask questions about the video content. Get answers powered by AI directly from the transcript.
GET MORE FROM YOUR TRANSCRIPTS
Sign up for free and unlock interactive viewer, AI summaries, translations, mind maps, and more. No credit card required.